శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 04 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
దత్తపది - అతి, గతి, చితి, పతి - బారతార్థం లో ...
సంధికి రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు ధృతరాష్ట్రునితో...
కం: గతి నే సంధికి వచియిం
చితి నిటు కురురాజ నీవు చేయుము, లేదో!
పతితులు నీశత సుతుల
య్యతివ నెడ సలిపినపాప మంతము జేయున్!
దత్తపది - అతి, గతి, చితి, పతి - బారతార్థం లో ...
ఆ.వె: అతివ జూచి నవ్వె నా మయ సభ లోన
ఛీఛి!చావ దగును చితిని పేర్చి!
ఐదు మంది పతుల యాపతివ్రత దు
ర్గతిని చూడక కురు పతిని గాను!
ఛీఛి!చావ దగును చితిని పేర్చి!
ఐదు మంది పతుల యాపతివ్రత దు
ర్గతిని చూడక కురు పతిని గాను!
సంధికి రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు ధృతరాష్ట్రునితో...
కం: గతి నే సంధికి వచియిం
చితి నిటు కురురాజ నీవు చేయుము, లేదో!
పతితులు నీశత సుతుల
య్యతివ నెడ సలిపినపాప మంతము జేయున్!
No comments:
Post a Comment