శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 04 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - చైత్రపు శోభలన్ గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్

ఉ: చిత్రమదేమి లేదు మరి చిత్తము పొంగుర యేరికైన నా
చైత్రపు శోభలన్ గన; నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్
చిత్ర విచిత్ర శబ్దముల చీదర కూతల పిచ్చి గంతులన్
చిత్రణ జేసి గీతముల, చిత్రములందున జూపుచుండినన్.

No comments:
Post a Comment