తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 4 September 2011

శంకరాభ(పూ)రణం - వదినను ముద్దడిగె మఱది పదుగురు ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


            సమస్య - వదినను ముద్దడిగె మఱది పదుగురు చూడన్

కం :  ముదముగ పుట్టిన రోజున
        పది యేడులు నిండ, వదిన పార్థుని కొరకై
        పదపడి నిడ లడ్డును,కో
        వ; దినను ముద్దడిగె మఱది పదుగురు చూడన్!  


కం :  కదలను నడకను బడికన,
        వదలకనే ముద్దు జేసి వాహనమున తా
        వదలిన; మూతిని ముడుచుచు
        వదినను ముద్దడిగె మఱది పదుగురు చూడన్!

2 comments:

కమనీయం said...

సదయత మాతృవిహీనుని
మది రోయక పెంచుకొనెను మాతృత్వమునన్
ముదమున నరుగుచు బడికిని
వదినెను ముద్దడిగె మరది పదుగుర యెదుటన్
------

గోలి హనుమచ్చాస్త్రి said...

'కమనీయం' గారూ ! మంచి భావం తో పూరించారు.
' మది రోయక పెంచుకొనెను, మగనికి తమ్మున్ '
అంటే ఎలా వుంటుంది ?
మీ పూరణ ఈ మధ్య శంకరాభరణం లో చూశాను. బాగుంది. కొనసాగించండి.
ధన్యవాదములు.