తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 2 July 2011

శంకరాభ(పూ)రణం - శిష్టు డెట్లు పల్కు శివ శివ యని.....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 -03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
     
                     సమస్య :  శిష్టు డెట్లు పల్కు శివ శివ యని

ఆ.వె :  హరికి భక్తు డయిన, ఆ వశిష్టాచారి
           హరుని నామ మొల్ల డనవరతము;
           శివుని రాత్రి నాడు చెప్పిచూచిననా వ
           శిష్టు డెట్లు పల్కు శివ శివ యని?

2 comments:

Anonymous said...

prasthuta premalu meeda mee openion rmudu seetha prama tho polika chupisthu purana cheyyandi. nenu karempudi maruthi

గోలి హనుమచ్చాస్త్రి said...

మారుతి గారూ ! బ్లాగు వీక్షణకు స్వాగతం.తరచుగా బ్లాగును వీక్షించి అభిప్రాయములు తెలుపగలరు.ధన్యవాదములు.
మీరు అడిగిన పద్యాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తాను...

కం. ప్రేమకు సీతా రాములు
ఈ మహిలో మారు పేరు; ఈనాడేమో
ప్రేమకు నర్థము మారెను
కామముగా దోచు చుండె కను మారుతి! హా !