తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 14 April 2011

దున్నను గొల్చినన్ తొలగు దోషములన్ని...

గతములో భవిష్యవాణి పత్రిక లో ఇచ్చిన సమస్యకు నే జేసిన పూరణము.

సమస్య : దున్నను గొల్చినన్ తొలగు దోషములన్ని లభించు పుణ్యముల్.

ఉ : ఉన్నది  దైవ మొక్కటను  ఉన్నత భావమునెంచి వానినే 
      సన్నుతి జేయగావలయు! శర్వుని రూపున ఆలయంబునం 
      దున్నను; చర్చిలో 'ప్రభుగ ' నున్నను; 'అల్లగ'  ఏమసీదుయం      
      దున్నను; గొల్చినన్ తొలగు దోషములన్ని లభించు పుణ్యముల్ !

4 comments:

Anonymous said...

dear sastry garu,
muga vani noti venta ragamu palikinchina vidhamu chala gamatuga unadi
thank you we wait to see some more from you


g.s.sastry
hyderabad

కంది శంకరయ్య said...

అద్భుతంగా ఉంది పూరణ.

గోలి హనుమచ్చాస్త్రి said...

శంకరార్యా! నమస్కారములు.మీవంటి విజ్ఞుల ప్రొత్సాహమే మాలాంటి వారికి ముందుకు నడిచే బలాన్ని ఇస్తుంది.ఇలాగే మీకు వీలున్నప్పుడల్లా తీరిక చేసుకుని తగిన సూచనలు సలహాలు ఈయవలసినదిగా కోరుచున్నాను.ధన్యవాదములు.

గోలి హనుమచ్చాస్త్రి said...

జీ యస్ శాస్త్రి గారూ! తరచు బ్లాగును వీక్షించి అభిప్రాయములు తెలుపుచున్నందుకు ధన్యవాదములు. ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.