తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 4 April 2011

శ్రీ కరం,శుభ కరం ఈ " ఖరం "

 బ్లాగు వీక్షకులందరకూ  నూతన ఉగాది శుభాకాంక్షలు.



ఖర వత్సరమందు హిమశి
ఖర వాసుడు,పురహర, లయ కారుడు, శశిశే
ఖరుడును!ఖరకర కులజుడు,
ఖర దూషణ రావణారి! కలుముల నిడుగా!

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

శాస్త్రి గారు,
మీ దత్తపద పూరణ విన్యాసము అలరిస్తున్నది.
సమస్యలను కూడా మీ పూరణలతో మనోజ్ఞంగా పరిష్కరిస్తున్నారు.
ఈ వేళ తి.తి.దే.వారు అష్టావధానం ప్రత్యక్ష ప్రసారం జరిగింది. చూశారా?

గోలి హనుమచ్చాస్త్రి said...

మందాకిని గారూ! స్వాగతం!సత్ అభిప్రాయము తెలియజేసినందులకు ధన్యవాదములు.తరచు బ్లాగును వీక్షించవలసినదిగా కోరుచున్నాను.
కార్యక్రమం తెలియనందువలన చూడలేక పోయానండీ.