తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday, 31 October 2022

"గోలీ"లు - 60


కందము:
అదిరేపని యని మనలో
మది రేపిన మంచిపనిని మానక, యోర్మిన్
అది రేపని నెట్టక నె
మ్మదిగా సాధించవలయు మనుజుడు గోలీ!

Saturday, 15 October 2022

"గోలీ"లు - 59


కందము:
"కావు"మని యరచు కాకికి
నేవేళను నాల్గుమెతుకు లిడకను, నరుడే
"కావుమని" యడుగ నీశుడు
కావంగా నడుగుగూడ కదలడు గోలీ!

Friday, 14 October 2022

"గోలీ"లు - 58

 


కందము:

చిరుగుల దుస్తుల తోడను

చిరులజ్జగ దిరుగుదురు కుచేలురు, కానీ

చిరు గులతో ఫ్యాషన్ గా 

చిరుగులతో కొందరుంద్రు చిత్రము గోలీ!

  



Saturday, 8 October 2022

"అర" విందము

 కందము: 

"అరవింద"మంటి ముఖములు
"అర" విందములాయె జూడ నందరి కిలలో
అరెరే "కోవిడ్" దెబ్బకు
అరలుచు కనిపించు "మాస్కు" లంటగ సగమే.


Thursday, 6 October 2022

"గోలీ"లు - 57


కందము:

వైరస్ ల వంటి కొందరు
వైరల్ గా జేయుచుండ వల్గర్ పోస్టుల్
వైరులు సంఘంబునకని
వైరులు కట్ చేయ బూన వలయుర గోలీ!


Wednesday, 5 October 2022

అమ్మలగన్నయమ్మ

 ఓం శ్రీ మాత్రే నమః


మీకు అందరకూ విజయదశమి శుభాకాంక్షలు.


ఉత్పలమాల: 

అమ్మలగన్నయమ్మ! మనమందున నమ్మితి నమ్మ నమ్ముమా!

ఇమ్మిక మించు సంపదల నిమ్మిక విద్యలనెల్ల నాకె నీ  

విమ్మిక కీర్తి, భోగముల నిమ్మనుచున్ మరి గోరబోను లే

ఇమ్మహి నీదయన్ విడక నిమ్ముగ నాపయి జూప చాలుగా!