తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday, 29 September 2017

డైనోర - బుష్ - యల్‍జి - డెల్ ..... భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 06 - 2017 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.దత్తపది: డైనోర - బుష్ - యల్‍జి - డెల్ ..... భారతార్థంలోఆ.వె:  
భీముడపుడు చాల ప్రీతుడై నోరార 
బుష్కలముగ స్తోత్రములను జదువ 
ఆంజనేయుడట దయల్ జిలుకగజూడ  
పవనుడెల్ల జూచి పరవశించె. 

No comments: