తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 22 January 2015

శివుఁడు దశరథునకు చిన్నకొడుకు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.సమస్య - శివుఁడు దశరథునకు చిన్నకొడుకు.ఆటవెలది:
గంగ నెత్తిన గల ఘనుడెవ్వడోచెప్పు
రాముడెవరి సుతుడు ప్రేమ మీర
సరిగ నేమగు మరి శత్రుఘ్ను డతనికి
శివుఁడు- దశరథునకు- చిన్నకొడుకు.

No comments: