తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 14 September 2013

నటరాజు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-7-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - నటరాజుతేటగీతి:
కదల లయ బద్ధ ముగ జూడ కాదె నాట్య
మటులె జగమంత కదలును నటన వలన
లయలు గలిగిన నటనకు, లయము జేయు
ఘటన లన్నింటి కిని నీవె గతివి దేవ.


2 comments:

Sharma said...

" జగమంత కదలును నటన వలన "

చక్కటి పచ్చి నిజాన్ని లయ బధ్ధంగా నాట్యంలో చూపించారు . భేష్ , భేష్ .

గోలి హనుమచ్చాస్త్రి said...

శర్మ గారూ ! ధన్యవాదములు.