తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 12 August 2011

శంకరాభ(పూ)రణం - యముని మహిషము యమహా....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31- 03 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                 సమస్య : యముని మహిషము యమహా  యయినది

ఆ.వె :  సైకతముల యందు సాగిపో వలెనన్న
           ఆంజనేయు  గుఱ్ఱ మదియె హాయి !
           దుక్కి రైతు తాను 'దున్న'గా వలెనన్న
           యముని మహిషము, యమ హాయయినది!

 ఆంజనేయు గుఱ్ఱము = ఒంటె
 

2 comments:

DARPANAM said...

శ్రీ గోలి గారూ,
అద్భుతం ----భావసౌ0దర్యసహితం.
అంతేకాదు న భూతో న భవిష్యత్

గోలి హనుమచ్చాస్త్రి said...

'దర్పణం' సాంబమూర్తి గారూ ! నమస్కారములు.
నా బ్లాగు వీక్షణ జేసి పూరణను మెచ్చు కున్నం దులకు ధన్యవాదములు. తరచుగా మీ వీక్షణ,అభిప్రాయాలను కోరుచున్నాను.