తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
ఉత్పలమాల:
పోలిక లొక్కటే యగుచు బుద్ధి తలంపుల, ప్రేమబంచుచున్
మేలిమి స్నేహబంధమున, మెచ్చగ నల్వురు ధీరచిత్తమున్
పాలును నీళ్ళవోలె కలిసుండగ దంపతులెల్లవేళలన్
జాలును దానిమించు ధర చక్కని జీవన మెద్ది లేదులే!
మేలు దలంచి కృష్ణ పరమేశ్వరు పాద సరోరుహమ్ములన్దాలిచి డెందమందు , తనుదాను సమర్పణ సేయు నట్టి యాశ్రీలు కదా ! మహోన్నతపు సేతలు , వాటిని కోరగాజాలును , దానిమించు ధర చక్కని జీవన మెద్ది లేదులే!
Post a Comment
1 comment:
మేలు దలంచి కృష్ణ పరమేశ్వరు పాద సరోరుహమ్ములన్
దాలిచి డెందమందు , తనుదాను సమర్పణ సేయు నట్టి యా
శ్రీలు కదా ! మహోన్నతపు సేతలు , వాటిని కోరగా
జాలును , దానిమించు ధర చక్కని జీవన మెద్ది లేదులే!
Post a Comment