తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 17 May 2019

మకరమ్మును ముద్దులాడె మగువ కడుఁ దమిన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 05 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - మకరమ్మును ముద్దులాడె మగువ కడుఁ దమిన్.

కందము: 
చకచక గోరింటాకును
టకటక నరచేత గడిగి "టటడా"మ్మనుచున్  
సకలమ్మెరుపని తన వా 
మకరమ్మును ముద్దులాడె మగువ కడుఁ దమిన్.

Sunday 12 May 2019

జడ "కందాలు" - 108

జడకందాలు నేర్చి(ర్పి)న వారికి శుభమగుగాక.

జడ కందములను జదువగ
జడుల మనంబుల గురియును సరసపు జల్లుల్
జడకందములను బెంచగ
జడలను బోషించుచుంద్రు జవారాళ్ళికపై.

---గోలి.🙂 🙏🙏🙏🙂

ఇతి "జడ" అష్టోత్తరశత కందపద్య సమా"హారం" సంపూర్ణం.

Saturday 11 May 2019

జడ "కందాలు" -107

జడ"కందము"లే


జడ"కందము"లను వ్రాయగ 
"జడకందము" పెరిగిపోయి జగమున నిలిచెన్  
జడ "తలవంచక" నిలుచును 
"జడతల"నే  కోరుకొంద్రు జవ్వనులికపై.  

Friday 10 May 2019

కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 8 - 05 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ

సమస్య - కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.

కందము:
మంజుల "జూ" లో దిరుగుచు 
రంజుగ  "నెల్ఫెంట్సు గ్రూపు" రయమున రాగా 
గుంజెను "సెల్ఫోన్ ఫోటో" 
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.

జడ "కందాలు" - 106


జడకు "వంద"నాలు. 

జడ! నిన్ను తలను దలచుచు 
జడ'కందము' లైదు వ్రాయ 'సార్ బ్నిం' చెప్పెన్ 
తడబడుచు నైదు వ్రాసితి 
తడవకు దడవకను  వ్రాయ దాటెను నూరే!

Thursday 9 May 2019

జడ "కందాలు" - 105


అమ్మ 'కం' జడలు 

'అమ్మ'లు వేసెడి జెడలే 
అమ్మాయిలు నచ్చరిప్పు డా'పార్లర్' లో  
'నమ్మెడు' పలు ఫాషన్లే 
అమ్మడు తా నచ్చు, జెప్పు నాహా!ఓహో!

Wednesday 8 May 2019

జడ "కందాలు" - 104


దండలు కృష్ణుని జడకే   


దండలు కృష్ణుని జడకే   
దండలు మరి నల్లత్రాచు తరహా జడకే
దండలు బారెడు జడకే
దండలు సరి మూర,బెత్త తక్కువ జడకే.

Tuesday 7 May 2019

జడ కందాలు" - 103


బుస-రుసలు

పొడవైన పాము బుసబుస 
జడనే విదిలించు భామ సరి రుసరుసలే  
సడిసేయకుంట నుండగ  
తడవింతయు గడచినంత తగ్గును 'బుస్-రుస్'.

Monday 6 May 2019

బాల్‌-రన్‌-వికెట్‌-విన్...భారతార్థంలో

శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 3 - 05 - 2019 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ


దత్తపది: బాల్‌-రన్‌-వికెట్‌-విన్...భారతార్థంలో 

(శ్రీకృష్ణుని తో అర్జునుడు)

కందము: 
విన్నపములు వినకనె వా 
రన్నారుగ సిద్ధమనుచు ననికిని, బావా! 
దున్నలుగ మనవికెట్టుల
పన్నుగ నొప్పుదురు? నిహతి బాలగుదురికన్.

జడ "కందాలు" - 102

జడ గంటలు మ్రోగును


గంటల తరబడి జడ, జడ 
గంటలనే దీర్చిగట్టి కన్నియరాగా 
గంటలు మ్రోగును మది, క్రీ 
గంటను జూడగనె కుర్రకారుకు గాదా!  

Sunday 5 May 2019

జడ "కందాలు" - 101

బాపూ "జడలు"

పూజడ, వాల్జడకై బా
పూ జడలున్నట్టి  భామబొమ్మలు గనరే 
నాజూకు వంపుసొంపులు 
తేజాలరు 'బాపు'వోలె తీరగు గీతన్.

Saturday 4 May 2019

జడ "కందాలు" - 100

ముడి లడ్కీ గడబిడ 

జడజడ బోల్తా క్యా హై? 
మెడ తక్ హీ జుట్టు హైతొ, మేడం మైనే  
గడ బిడ కుఛ్ నై కర్తీ
ముడి దాల్కే ముస్కురాతె, ముష్కిల్ జడ తో.

Friday 3 May 2019

జడ "కందాలు" - 99

జడజగడము దీర్చక

జడకే పూవిచ్చుటలో 
బడె తా బడరాని పాట్లు భగవానుండే 
జడజగడము దీర్చకనొక
గడియైనను సుఖముబొంద గలుగడు పతియే. 

Thursday 2 May 2019

జడ "కందాలు" - 98

జడ "గంట" బట్టు

అమ్మాయీ !జడ వేస్తా 
నమ్మీ!'జడగంట' బట్టు మదియును గడుదున్ 
అమ్మా!యీ జడ వద్దే 
అమ్మో!జడ 'గంటబట్టు' నటునిటు దువ్వన్.

Wednesday 1 May 2019

జడ "కందాలు" - 97


జడ వీణను మీటగనే

తడబడు నడకల వధువే 
నడచుచు తావచ్చి వరుని నగవుల గనుచున్ 
జడ వీణను మీటగనే
సుడి తిరిగె నతని మనసున సుస్వర గతులే.