తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 10 April 2022

చింతామణి

 అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.


కందము:
చింతలు మాకేలయ మా
చింతామణి రాముడుండ, చిన్మయ రూపున్
చింతనతో మనముల దు
శ్చింతనలే వీడి భక్తి జేతుము భజనల్.


Wednesday 6 April 2022

"గోలీ"లు - 50



కందము:
పిల్లల కెదురుగ నందగ
బెల్లపు డబ్బానుబెట్టి బెదిరింపులతో
నొల్లదు మీకని చెప్పుట
"సిల్లీ"గానుండు ననుచు జెప్పెను గోలీ!


Saturday 2 April 2022

"యుగాది"

 

మీకు అందరికీ "శుభకృత్" నామ వత్సర శుభాకాంక్షలు. సీసము: దుష్ట వైరసుపైన తోచిన కోపమ్ము "కారమై" మనసుల కదలుచుండె పాడు కోవిడు భువి బట్టిన పీడయై "చేదు" జ్ఞాపకముల చీడ మిగిలె టీకాల దయతోడ మాకేమికాదను "తీపి" విశ్వాసమ్ము తీరు నిండె గుమిగూడ వచ్చిక గుబులేమివలదన "పుల్ల"దనమ్ము ప్రఫుల్లమాయె ఆటవెలది: "వగరు"గాను తోచె వాడరా "మాస్కన" "ఉప్ప"దనము నిచ్చె నొక్క "శంక" ఇన్ని గలసి యుండ నెన్నియో శుభముల నీ"యుగాది" బంచు నిజము నిజము.