తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 14 November 2022

"గోలీ"లు - 64

కందము: 

పాలిచ్చు తల్లి, తదుపరి
పాలిచ్చెడు తండ్రి పైన పండితగురువుల్
పాలించవలయు, బాలల
పాలవ సంస్కార బలము బాగుగ గోలీ!


Wednesday 9 November 2022

"గోలీ"లు - 63

 


కందము:
ఏమరక నుండవలయుర
యే మరకలు మీదబడక నెప్పటికైనన్
ఆముదపు ముఖము జూపక
నా ముదమును నింప మదికి హాయనె గోలీ!



Friday 4 November 2022

"గోలీ"లు - 62

 


కందము: 

"చుక్కెదురైతే" కష్టము

అక్కర  పనిజేయువారి కపశకునమెలే

"చుక్కె"దురైతే యిష్టము 

మక్కువగా  త్రాగు వారి మదికే గోలీ! 



Thursday 3 November 2022

"గోలీ"లు - 61

 కందము: 

"ఇంకే"దో కలమందున 

నింకకనుండిన రచనల కిది చాలదురా 

ఇంకను తలలో నిండుగ

"నింకేదో" యుండవలయు నెప్పుడు గోలీ! 


-