తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday, 14 December 2024

సమయోచిత పద్యరత్నము – 30


ఉత్పలమాల:
జ్ఞానముగల్గు సత్వగుణ సజ్జను కెప్డు, రజోగుణమ్ముచే
దానను లోభమున్ గలుగు దప్పక, నున్న తమోగుణమ్ము య
జ్ఞానము తోడనా భ్రమ యజాగ్రతయున్ మరపన్నదౌనుగా
మానవ నైజమే యదియు మానగ సాధన జేయగావలెన్.


3 comments:

Anonymous said...

బాగుంది 🌹🎊

వెంకట రాజారావు . లక్కాకుల said...

కానరు తల్లిదండ్రులను కానరు గుర్వుల దైవతమ్ములన్
కానరు బంధు మిత్రులను కానరు పూజ్యుల పెద్దలన్ తథా
కానరు కళ్ళకున్ బొరలు గ్రమ్మిన వేళల మానవాధముల్
మానవ నైజమే యదియు మానగ సాధన సేయగావలెన్ .

గోలి హనుమచ్చాస్త్రి said...

బాగుందండీ...నమస్సులు