(జూన్ 2024 రవళి మాసపత్రికలో ప్రచురితమయినవి)
కందము:
కాలము జూడగ మాయా
జాలము, లోకాల బట్టి చక్కగ లాగే
గాలము, దీనిన్ తెలియగ
జాలము, జాలమున నైన సత్యము గోలీ!
కందము:
మొగమున నొక్కటియౌ చిరు
నగవును మరి వదలబోక నగవలె, నదియే
నగవలె మెరయుచు నీకిక
జగమున గలిగించుగద హుషారును గోలీ!
కందము:
దీపములార్పుట మానుము
దీపము వెలిగించి మ్రొక్కి దేవుని చెంతన్
తాపీగా ధ్యానించుము
"హ్యాపీ బర్త్ డే" దినమున హాయగు గోలీ!
కందము:
కాలూ చేతులు కదుపగ
వేలుగ పలునాటలుండ వీడుచు వాటిన్
వ్రేలున మీటెడు నాటల
వ్రేలాడెడు పిల్లవాండ్రు "వేస్టుర" గోలీ!
No comments:
Post a Comment