ఫిబ్రవరి '24 "రవళి" మాస పత్రికలో ప్రచురితమైన నేను వ్రాసిన పద్యములు.
కందము:
వినవలదుర చెడు మాటలు
కనవలదుర కానిపనులు కన్నులతోడన్
అనవలదుర చెడు పలుకులు
మనవలదుర మంచిలేక మనమున గోలీ!
కందము:
మన మేమనవలదుర భువి
మనమే గొప్పని పరుషపు మాటల పరులన్
మన వలెనందరు సుఖముగ
మనవలెనని దలచవలయు మనముల గోలీ!
No comments:
Post a Comment