శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 01 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్
కందము:
మితి మీరిన గర్వముతో
నతలాకుతలమ్ము జేయ నన్నిజగములన్
పతితుండు మహిషుడు రాక్షస
పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్
కందము:
మితిమీరి త్రాగి రాతిరి
మతిమాలుచు సుతను బట్టి మానము జెరచన్
గతి దప్పి మహిషు మించిన
పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్.
సమస్యకు నా పూరణ.
సమస్య - పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్
మితి మీరిన గర్వముతో
నతలాకుతలమ్ము జేయ నన్నిజగములన్
పతితుండు మహిషుడు రాక్షస
పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్
కందము:
మితిమీరి త్రాగి రాతిరి
మతిమాలుచు సుతను బట్టి మానము జెరచన్
గతి దప్పి మహిషు మించిన
పతి తల ఖండించె సతియె పదుగురు మెచ్చన్.
No comments:
Post a Comment