శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19-10-2011 న ఇచ్చిన సమస్యకునా పూరణ
సమస్య - కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్
కందము:
ఉంచితి నీకై కందులు
కుంచములోఁ బోతునక్క, కూనలఁ బెట్టెన్
పంచను మూలన పిల్లియె
పంచను మనసాయె నాకు పట్టవె యక్కా !
కందము:
దంచిన బియ్యము పోయుము
కుంచములోఁ బోతునక్క, కూనలఁ బెట్టెన్
పంచను పిల్లియె, కుక్కలు
పొంచెను మా వీధిలోన పోయెద నక్కా!
సమస్య - కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్
కందము:
ఉంచితి నీకై కందులు
కుంచములోఁ బోతునక్క, కూనలఁ బెట్టెన్
పంచను మూలన పిల్లియె
పంచను మనసాయె నాకు పట్టవె యక్కా !
కందము:
దంచిన బియ్యము పోయుము
కుంచములోఁ బోతునక్క, కూనలఁ బెట్టెన్
పంచను పిల్లియె, కుక్కలు
పొంచెను మా వీధిలోన పోయెద నక్కా!
No comments:
Post a Comment