తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------
(కోవిడ్ సమయంలో వ్రాసినది)
మత్తేభము:
స్తవనీయుండగు జానకీపతి తగన్ తాభద్ర శైలమ్ముపై
నవనీజాతను బట్టువేళ గనగా నయ్యో నరుల్ లేరనెన్
దివిదేవుల్ దిగ శాంతిగల్గు ప్రజకున్ దీవింప రారండనన్
భువిలో రాముని పెండ్లి జూడ వరుసన్ బోచుండిరే దేవతల్.
స్తవనీయంబు భువిన్ గడున్ మిథిల సీతారామ కళ్యాణ వైభవ సంరంభమునన్ వెలుంగ విని భావంబందు సంభావనాజవనాశ్వంబులు పర్వగా నరుగొ క్ష్మాదేవతల్ దండిగాభువిలో రాముని పెండ్లి జూడ వరుసన్ బోచుండిరే దేవతల్.
బాగుందండీ...నమస్సులు
Post a Comment
2 comments:
స్తవనీయంబు భువిన్ గడున్ మిథిల సీతారామ కళ్యాణ వై
భవ సంరంభమునన్ వెలుంగ విని భావంబందు సంభావనా
జవనాశ్వంబులు పర్వగా నరుగొ క్ష్మాదేవతల్ దండిగా
భువిలో రాముని పెండ్లి జూడ వరుసన్ బోచుండిరే దేవతల్.
బాగుందండీ...నమస్సులు
Post a Comment