"రవళి" ప్రారంభ సంచిక అక్టొబర్ '23 నందు ప్రచురితమైన నా పద్యము.
శార్దూలము:
శ్రీమాతా! నిను గొల్చువారికెపుడున్ సిద్ధించుగా కామనల్
గోమాతా! నిను బెంచువారి కిరవౌ కొండంతగా దీవెనల్
భూమాతా! నిను నమ్మువారి కొదవున్ భోజ్యమ్ముకౌ సంపదల్
ధీమంతుల్ విధి గొల్చి, పెంచి సరియౌ తీరున్ మదిన్ నమ్మరే?
No comments:
Post a Comment