నన్నయ సహస్రాబ్ది మహోత్సవముల సందర్భంగా కుర్తాళం శ్రీ సిద్దేశ్వర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి మహా స్వాముల వారి దయతో 10-11-2023 న గుంటూరునందు ఏర్పాటు చేసిన కవితా గోష్టి లో నేను వ్రాసి చదివిన పద్యాలు.
స్వామి వారి ఆశీస్సులు కోరుతూ...
కందము:
కుర్తాళం పీఠాధిప
మూర్తిగ పుంభావమైన ముఖవాసినిగా
కీర్తిగడించిన స్వామీ
ఆర్తిగ నేవేడెదనిక నాశీస్సులనే.
-----------------------------------
నన్నయ భట్టారకుని గురించి....
కందము:
ఆదికవియగుచు తెనుగున
మీదగు జ్ఞ్ఞానమ్ము బంచి మెచ్చగ బుధులే
మీదట రాగల కవులకు
రాదారిని జూపినావు రమ్యముగానే.
శార్దూలము:
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ యనుచున్ శ్రీకారమున్ జుట్టుచున్
ఆ వేదమ్మును బోలు భారతమునే ఆంధ్రమ్మునన్ వ్రాయగా
నీ వాక్కుల్ ఘన పద్యరాశి యగుచున్ నిర్మాణమై కావ్యమే
నీవే తెల్గున నాదియైన కవిగా నిర్దేశముల్ జేసెగా.
కందము:
నన్నయ్యవు నీవే లే
అన్నయ్యవు తెల్గుకవుల కందరకును నీ
యున్నత కవనపు పద్యా
లెన్నగ నీభువిని నిలచునిక వేయేండ్లున్.
No comments:
Post a Comment