తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday, 11 March 2021

ఆకసమంత లింగమని

 అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

శివానుగ్రహ ప్రాప్తిరస్తు.

ఉత్పలమాల:
ఆకసమంత లింగమని యచ్చట దేవతలెల్ల గూడుచున్
శ్రీకర పూజసల్పిరట, చిత్రముగా శివరాత్రి వేళనన్
దూకుచు క్షీర, భస్మ, దధి తుంపరలన్నియు వ్యోమవేదికన్
ప్రాకుచు నున్నవౌర ఘనపంక్తులవేయనునట్లు చూడగన్.No comments: