శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 10 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - నడిరేయిన్ రవిఁగాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.
మత్తేభము:
వడిగా పద్యములెన్నొ వ్రాయ మదిలో భావించగా భావనల్
సుడిగా ముప్పిరిగొన్నవాయె తుదకున్ చూడంగ ధీశక్తితో
నొడిలో పుస్తకముంచివ్రాయ రవి, తా ' మో ' యంచు ధారాగతిన్
నడిరేయిన్ 'రవిఁ' గాంచి యుత్పలము లానందంబునన్ విచ్చెడిన్.
తాము (ఓ) యంచు
ఉత్పలములు = ఉత్పలమాలా వృత్తములు.
No comments:
Post a Comment