శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 07 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - సారా గొనె శివుడు లోకసంరక్షణకై.
కందము:
చేరుచు జిలుకగ సంద్రము
మీరుచును హలాహలమట మీదకు రాగా
ఘోరము నాపగ తన మన
సారా గొనె శివుడు లోకసంరక్షణకై.
కందము:
సారా యనగా మొత్తము
పారావారమ్ము జిలుక వచ్చిన విషమున్
చేరుచు నింత మిగల్చక
"సారా" గొనె శివుడు లోకసంరక్షణకై.
సమస్యకు నా పూరణ.
సమస్య - సారా గొనె శివుడు లోకసంరక్షణకై.
కందము:
చేరుచు జిలుకగ సంద్రము
మీరుచును హలాహలమట మీదకు రాగా
ఘోరము నాపగ తన మన
సారా గొనె శివుడు లోకసంరక్షణకై.
కందము:
సారా యనగా మొత్తము
పారావారమ్ము జిలుక వచ్చిన విషమున్
చేరుచు నింత మిగల్చక
"సారా" గొనె శివుడు లోకసంరక్షణకై.
No comments:
Post a Comment