శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.
కందము:
చదువన పఠనమె కాదది
పదపడి జగతిని చదువక పతనమె జరుగున్
పదములు బయటనె పెట్టక
చదువులలో సార మెఱిఁగి చవటగ మాఱెన్.
హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని గురించి చణ్డామార్కులతో ..
కందము:
పెదవులు కదిపిన 'హరి' యను
చదువది చెప్పిన విధమిద చండా మార్కా?
వెదకిన దొరకని 'శ్రీహరి
చదువులలో' సార మెఱిఁగి చవటగ మాఱెన్.
2 comments:
చాలా బాగుంది అండీ...
చదువు గురించి చాలా చక్కగా చెప్పారు...
సీత గారూ! ధన్యవాదములు.
Post a Comment