శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-09-2010 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - సారా త్రాగిన మోక్ష మందెదము శిష్యా శంక నీ కేలరా
శా : ఈ 'రా' ప్రక్కన 'మా' ను వ్రాసి పలుక న్నీశుండె శ్లాఘించుగా
ఏరా! చింతలు నీకవేల వినరా !ఈ రామనామామృతం
'సార' మ్మేగద వేదమంత్రములకున్ సందేహ మింకేల నీ
'సారా' త్రాగిన మోక్ష మందెదము శిష్యా! శంక నీ కేలరా?

No comments:
Post a Comment