Saturday, 25 January 2025

సమయోచిత పద్యరత్నము – 57



చంపకమాల:
ఎనిమిది మాసముల్ శ్రమయె హాయగు వత్సరమందు కాపుకున్
పనులను జేయగా బగలు బాగుగ నిద్రయె గల్గు రాత్రులన్
తనువున శక్తియున్నపుడె ధర్మము సల్పిన శాంతియౌ జరన్
వినుముర!జన్మమంతయును వీడకు యత్నము ముక్తికోసమై.


1 comment:

  1. అనయము దృష్టి కృష్ణపరమాత్మ పయిన్నిడి , ధర్మమార్గమున్
    ఘనముగ బూని , జీవనము గడ్పుము , మాధవు డెంచి , నీకు పా
    వనమగు దివ్యభవ్యపథ భాగ్య మొసంగును , వాసుదేవునిన్
    వినుముర ! జన్మమంతయును వీడకు , యత్నము ముక్తి కోసమై .

    ReplyDelete