Friday, 24 January 2025

సమయోచిత పద్యరత్నము – 56

 

ఉత్పలమాల:

పోలిక లొక్కటే యగుచు బుద్ధి తలంపుల, ప్రేమబంచుచున్

మేలిమి స్నేహబంధమున, మెచ్చగ నల్వురు ధీరచిత్తమున్

పాలును నీళ్ళవోలె కలిసుండగ దంపతులెల్లవేళలన్

జాలును దానిమించు ధర చక్కని జీవన మెద్ది లేదులే!  


1 comment:

  1. మేలు దలంచి కృష్ణ పరమేశ్వరు పాద సరోరుహమ్ములన్
    దాలిచి డెందమందు , తనుదాను సమర్పణ సేయు నట్టి యా
    శ్రీలు కదా ! మహోన్నతపు సేతలు , వాటిని కోరగా
    జాలును , దానిమించు ధర చక్కని జీవన మెద్ది లేదులే!


    ReplyDelete