Wednesday, 18 December 2024

సమయోచిత పద్యరత్నము – 34

 

(కోవిడ్ సమయంలో వ్రాసినది)

మత్తేభము: 

స్తవనీయుండగు జానకీపతి తగన్ తాభద్ర శైలమ్ముపై

నవనీజాతను బట్టువేళ గనగా నయ్యో నరుల్ లేరనెన్ 

దివిదేవుల్ దిగ శాంతిగల్గు ప్రజకున్  దీవింప రారండనన్  

భువిలో రాముని పెండ్లి జూడ వరుసన్ బోచుండిరే దేవతల్.


2 comments:

  1. స్తవనీయంబు భువిన్ గడున్ మిథిల సీతారామ కళ్యాణ వై
    భవ సంరంభమునన్ వెలుంగ విని భావంబందు సంభావనా
    జవనాశ్వంబులు పర్వగా నరుగొ క్ష్మాదేవతల్ దండిగా
    భువిలో రాముని పెండ్లి జూడ వరుసన్ బోచుండిరే దేవతల్.

    ReplyDelete