Wednesday, 29 November 2023

"గోలీ"లు 75-79

 "రవళి" మాసపత్రిక రెండవ సంచిక (డిసెంబర్ 2023) నందు ప్రచురించబడిన నేను వ్రాసిన పద్యములు.

 

"గోలీ"లు

 

కందము:

శ్రీమంతుడ నాకేమని 

ధీమాగా కష్టబడక తినికూర్చుంటే

 మంచువోలె కరుగును

చీమంతగ మారు నీదు సిరులే గోలీ!

 

కందము:

పొటీలో గెలుపునకై 

ధాటిగ యత్నించవలయు ధర్మంబుగనే

ఓటమి జెందిన గానీ

ఆటన్ సహజంబనుకొన నగురా గోలీ!

 

కందము:

వండే వంటలు శుచిగా

నుండంగను జేయవలయునుర శుభ్రతగా

"వండే" దాటిన పిదపను

మొండిగ హీట్జేసి తినగబోకుర గోలీ!

 

కందము:

తీయనిదౌ కంఠమ్మే

గాయకునకు నున్న సొగసు కాదులె, భాషన్

హేయముగా పలికి పరువు  

దీయనిదౌ నటులనుంట దివ్యము గోలీ!

 

కందము:

సలుపుచు  నుండుము ధర్మము

నిలలో బోరంగవలయు నిది చేయుటకై

సలుపులు కలిగినగానీ

మెలకువతో సైచి దాట మేలగు గోలీ!  

 

3 comments:

  1. చక్కనికవితలు సులువుగ
    నెక్కించెన్ కందపద్యమేర్పడఁగనగన్
    నిక్కంబుగోలిశాస్త్రుల
    దృక్కోణముధర్మదృష్టి దృష్టాంతంబౌ!
    గాదిరాజు మధుసూదన రాజు

    ReplyDelete
  2. శ్రీ గాదిరాజు గారికి ధన్యవాదములు

    ReplyDelete
  3. శ్రీ గాదిరాజు గారికి ధన్యవాదములు

    ReplyDelete