Sunday, 9 August 2020

"గోలీ"లు - 4

 కందము: 

తప్పని జెప్పిన దప్పును 

తప్పనిసరి యనుచు జేయ దప్పది తప్పే 

తప్పక జేసిన తప్పును 

తప్పక సరిజేయ ముప్పు తప్పును గోలీ!


 

1 comment:



  1. చెప్పిరి చప్పున టప్పని
    మెప్పగు పల్కులను గోలి మీదగు శైలిన్
    తప్పక నిదియే యొప్పగు
    నెప్పటి కిన్ జనులెరుంగి నెమ్మది బడయన్ :)



    జిలేబి

    ReplyDelete