Wednesday, 17 July 2013

వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య- వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.

కందము:
అకటా వినతా సుతునకు
నిక కాళ్ళే లేవు వాని నిన సారథిగా
ప్రకటింపగ సంతసమున
వికలాంగుఁడు రథము నడిపె వినువీథిపయిన్.

No comments:

Post a Comment