Thursday, 13 September 2012

ఖలులకు సత్కారములిట ఘనముగ జరుగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25-09-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - ఖలులకు  సత్కారములిట ఘనముగ జరుగున్.

కందము:
ఖలులే గలరన్ని యెడల
విలువలు గలవారి కచట విలువే లేదే
'విలువకు' ఛీత్కారమ్ములు
'ఖలులకు' సత్కారములిట ఘనముగ జరుగున్.

No comments:

Post a Comment