Saturday, 14 July 2012

సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్.

శ్రీ  కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - సాయీ రూపమ్ము మనకు సంకటము లిడున్.

కందము:
ఓయీ ! మార్చుము ! పూజలు
చేయకు పగిలిన
ప్రతిమకు, చెప్పితి వినుమా !
తీయక నే జేసినచో
సాయీ రూపమ్ము, మనకు సంకటము లిడున్!

3 comments:

  1. ఓం సాయిరాం..
    చాలా బాగా పూరించారు...

    ReplyDelete
  2. సాయి గారూ! ధన్యవాదములు.

    ReplyDelete
  3. చాలా బాగుంది అండీ...
    ఓం సాయి రాం..

    ReplyDelete