Thursday, 20 October 2011

కైలాసము వీడి యీడ కాపురముంటే

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 12-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


           సమస్య - కైలాసము వీడి యీడ కాపురముంటే


కం: వేళాకోళము లాడకు
       మేలాభువి నుండ గలము? మేలా ? తినగన్
       హాలా హలధర ' కల్తీ '
       కైలాసము వీడి యీడ కాపురముంటే ! 

1 comment:

  1. 1.
    భూలోకమ్మున మనుజులు
    వాలాయము వచ్చుచుండ్రి పలు శకటములన్
    శైలసుతా పోదము పద
    కైలాసము వీడి యీడ కాపురముంటే

    2.ఏలా కోపము నీకిటు
    శైలసుతా నను విడచి విజనమగు నటవిన్,
    మేలా నీవిటు రాగను
    కైలాసము వీడి యీడ కాపురముంటే

    ReplyDelete