Saturday, 13 August 2011

శంకరాభ(పూ)రణం - కవులు నియమములకు గట్టు బడరు....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                      సమస్య :  కవులు నియమములకు గట్టు బడరు

ఆ.వె: గణము,ప్రాస,యతులు,కట్టుబాటులు కొన్ని
          పద్య కవిత లందు పరిఢవిల్లు!
         వచన కవిత లందు, భావ కవిత లం
దు
         కవులు నియమములకు గట్టు బడరు!  

4 comments:

  1. నిండుగ బూతు మాటలు
    చూడగ మరిఎన్నొద్వంద్వార్థములున్

    ధనముకోసమె వ్రాసెడి సినీ
    కవులు నియమము లకు కట్టు బడరు

    శ్రీనివాస్

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారూ ! చక్కటి పూరణకు భావాన్నిచ్చారు.
    మీ భావానికి పద్య రూపం ...చిత్తగించండి..

    రెచ్చ గొట్టు నట్టి రెండర్థముల తోడ
    బూతు మాటలెన్నొపోత పోసి
    పాట లమ్ము కొనుచు వ్రాసెడి సినిమాల
    కవులు నియమము లకు కట్టు బడరు

    ReplyDelete
  3. శాస్త్రి గారూ

    ఈ సారి పద్యము వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదములు

    ReplyDelete
  4. శ్రీనివాస్ గారూ! సంతోషం ..మీ పద్యం కోసం ఎదురు చూస్తుంటాను....

    ReplyDelete