Monday, 4 April 2011

శ్రీ కరం,శుభ కరం ఈ " ఖరం "

 బ్లాగు వీక్షకులందరకూ  నూతన ఉగాది శుభాకాంక్షలు.



ఖర వత్సరమందు హిమశి
ఖర వాసుడు,పురహర, లయ కారుడు, శశిశే
ఖరుడును!ఖరకర కులజుడు,
ఖర దూషణ రావణారి! కలుముల నిడుగా!

2 comments:

  1. శాస్త్రి గారు,
    మీ దత్తపద పూరణ విన్యాసము అలరిస్తున్నది.
    సమస్యలను కూడా మీ పూరణలతో మనోజ్ఞంగా పరిష్కరిస్తున్నారు.
    ఈ వేళ తి.తి.దే.వారు అష్టావధానం ప్రత్యక్ష ప్రసారం జరిగింది. చూశారా?

    ReplyDelete
  2. మందాకిని గారూ! స్వాగతం!సత్ అభిప్రాయము తెలియజేసినందులకు ధన్యవాదములు.తరచు బ్లాగును వీక్షించవలసినదిగా కోరుచున్నాను.
    కార్యక్రమం తెలియనందువలన చూడలేక పోయానండీ.

    ReplyDelete