Friday, 27 March 2026

రామా! రావయ్యా

 శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః

మీకు అందరికీ

శ్రీరామ నవమి శుభాకాంక్షలు. 


కందము:

ముదమున నిను మది దలచుచు

పదముల వదలక గొలిచెద వడి రావయ్యా!

సదయుడ రామా! నిను గని

పదపడి మాపైకి వెతలు పడి రావయ్యా.


Thursday, 19 March 2026

రా! పరాభవా!

 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.


(డిశంబరు, జులై, మార్చి, మే - అను ఇంగ్లీషు నెలల పేర్లను వాడుతూ తెలుగు సంవత్సరాదికి చెప్పిన స్వాగత పద్యం)    


ఉత్పలమాల: 

సాగిలి మ్రొక్కి భీతివిడి శంబరువైరికివైరి శంభుకున్          

ఈ గతినుండె నామమని నెన్నక, భావిని మంచి రోజులై             వేగమె నిన్నమొన్న గత పీడలకాలము  మార్చివేయగా       

స్వాగతమేను జెప్పెదను సత్ఫలమీయగ రా! పరాభవా!