Monday, 23 December 2024

సమయోచిత పద్యరత్నము – 39

 


ఉత్పలమాల:
తల్లిని మించి పోషణను ధారుణి జేయగ వారు లేరుగా!
అల్లన దారతో సమము హాయిని గూర్పెడు వారలుండునా?
కల్లయెగాదు విద్య కనకంబున జేసిన భూషణమ్మెగా!
యుల్లమునందు చింత తగ'నొప్పిన' కాయము గాయమేసుమా!


2 comments:

  1. మల్లియలార మీ సొగసు మా వెతలన్ యెగదోయు కోసమా
    కల్లరి చంద్రుడా గగన కాంతులు మమ్ము దహించు కోసమా
    ఎల్లరు ప్రేమికుల్ విరహ హృ త్తను తప్తత నిట్లు పాడుటన్ ,
    యుల్లమునందు చింత తగ'నొప్పిన' కాయము గాయమేసుమా!

    ReplyDelete