Wednesday, 14 August 2013

తాటక సంహారము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09-07-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

వర్ణ (న) చిత్రం - తాటక సంహారము



























కందము:
తాటక నిలువుము నిను బం
తాటగ నే నాడుకొందు ధైర్యము గలదా?
తాటను దీసెద నటుపై
తాటాకును గాల్చినట్లు తగులంబెడుదున్!

2 comments:

  1. తాటకను బంతాటగ చెండాడుకున్న పద్య వైనం చాలా బాగుంది .

    ReplyDelete
  2. శర్మ గారూ ! ధన్యవాదములు.

    ReplyDelete