Sunday, 25 November 2012

పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

కందము:
వినరా మంచము నల్లెద
మనగా నే పద్య మొకటె యల్లెద నంటిన్ 
విని మాబావయె యనెనిటు
పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

2 comments:

  1. బుల్లబ్బాయ్25 November 2012 at 15:13

    తెలుగు బ్లాగు చర్చలు
    తెరిచి చూచిన చాలు, పూరణములే యాన్ని
    దారుణములే! కారణమ్ములేమన,
    పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్

    (గురువు గారు, చందస్సులు స్కూల్రోజుల్లోనే గుంటదీసిగంటవాయించా.. యేదో కామెడీకి ఇట్టా రశా.. యేమనుకోకండి.)

    ReplyDelete
  2. బుల్లబ్బాయి గారూ ! మీరు 'బుల్లబ్బాయ్' కదా ... ఏమీ అనుకోనులెండి. బ్లాగును వీక్షించి వ్యాఖ్యానించి నందులకు ధన్యవాదములు.

    ReplyDelete