Sunday, 6 May 2012

చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్

కందము:  
దడువకు, నిర్మల చిత్తము 
మడిగట్టుక, లోకమునకు మాతా పితలై 
అడిగిన చాలును రక్షిం 
చెడు వారిన్ గొలువఁ దీరు చిరకామ్యంబుల్.

3 comments:

  1. గోలి వారికి అభినందనలు ...

    తడయక తమ యుద్యోగుల
    యిడుమలు గుర్తించి , జీతమిడి , తమకిడు న
    ట్లెడ నెడ కడు గౌరవ మి
    చ్చెడు వారిం గొలువ తీరు చిర కామ్యంబుల్

    - ఇది నేను సూచించిన సమస్య . స్మృతికి దెచ్చి నందులకు ధన్యవాదములు .

    ReplyDelete
  2. బాగుంది చక్కటి పూరణ

    ReplyDelete
  3. రాజా రావు గారూ! పింగళి శశిధర్ గారూ!స్వాగతం.మీ సహృదయ వ్యాఖ్యలకు ధన్యవాదములు.

    ReplyDelete