Sunday, 12 February 2012

కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


  సమస్య -  కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు


కందము : 

గౌరి పెద్దన్న పేరేమొ కనకరాజు
'కనక' మామయ్య పిల్లను 'కపి ' యటంచు 
నాట పట్టించి ఏడ్పించు నాత డిపుడు
'కపిని' కళ్యాణ మాడెను గౌరి కొడుకు. 

4 comments:

  1. సమస్యకు తగ్గ పూరణం

    ReplyDelete
  2. భావ రాజు గారూ ! బ్లాగును వీక్షించి మీ భావమును వ్యక్తము చేసినందులకు ధన్యవాదములు.

    ReplyDelete
  3. ఛాయచిత్రము నందున చక్కదైన
    బాలికను జూపి సమ్మతి బడసి ,వేరు
    పాపనున్ గట్టబెట్టిరి రూపమందు
    కపిని కళ్యాణమాడెను గౌరికొడుకు.
    --------------

    ReplyDelete
  4. కమనీయం గారూ ! కపిని ' కట్టబెట్టిన' మీ పూరణ బాగుంది.అభినందనలు.

    ReplyDelete