Friday, 11 November 2011

గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

       సమస్య - గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్

కం:  గుండ్రాయని పొర బడితిని
        గండ్రిసుకన పైన మెరసి కనబడుచుండన్!
        ఎండ్రియె యది, కాల్దగులగ
        గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్!!  

1 comment:

  1. పండ్రెండేడుల బాలుడు
    రండ్రా కార్టూను చూడ రండని పిలువన్
    వాండ్రా టీవీ చూడగ
    గుండ్రాతికి కాళ్ళు వచ్చి గున గున నడిచెన్,

    ReplyDelete