Monday, 24 October 2011

నీతిని మట్టుబెట్టవలె నేతలు పెద్దలు....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 19-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


                సమస్య - నీతిని మట్టుబెట్టవలె నేతలు పెద్దలు దేశభక్తులున్


ఉ:  భీతిని లేక జేతురిల పెద్దల బోలిన గ్రద్ద,నక్కలే
     నీతిని పైకి జెప్పి జన నేతగ మారుచు' స్కాము' లెన్నియో
     జాతిని మేలుకొల్పి జనజాగృతి తోడుగ చూడ నిట్టి దు
     ర్నీతిని మట్టుబెట్టవలె నేతలు పెద్దలు దేశభక్తులున్. 

2 comments:

  1. అహంకార
    దురహంకార
    మద మాత్సర్యముల
    వినీతిని మట్టు బెట్టవలె
    నెతలు పెద్దలు

    ReplyDelete
  2. ' జిలేబి ' గారూ ! స్వాగతం. మధురమైన మైన సమన్వయ వ్యాఖ్య చేశారు. ధన్యవాదములు.అప్పుడప్పుడు మాకు జిలేబిని(తీయని వ్యాఖ్యలు)
    పంచుతూ వుండండి

    ReplyDelete