Thursday, 6 October 2011

జయములు గలుగును, అరిషడ్వర్గములారును ఆరును.....

బ్లాగు వీక్షకులందరకు విజయ దశమి శుభాకాంక్షలు.


కం: జయములు గలుగును నిజముగ
       భయములు మరి తొలగి భోగ భాగ్యము లబ్బున్ 
       రయమున చదువులు వచ్చు, వి 
       జయ దశమిని దుర్గ గొలిచి శరణము వేడన్.
కం: దుర్గతి గలుగదు, జీవన
       మార్గము గన స్వర్గ మగును,మనసున అరిష 
       డ్వర్గములారును ఆరును,
       దుర్గను మది దలచి వేడ దురితము లగున్ .  
  


3 comments:

  1. సుందర పద్యమ్ములతో
    విందొసఁగెడి బ్లాగు మీది విజయదశమి కే
    నందింతు శుభాకాంక్షల
    నందుకొనుము సఖుఁడ! గోలి హనుమచ్ఛాస్త్రీ!

    ReplyDelete
  2. శంకరార్యా ! ధన్యవాదములు.
    నా బ్లాగునకు స్పూర్తి, ఊపిరి అయిన మీకు వినయ పూర్వక నమస్సులు.

    ధన్యుడ నైతిని గురువర!
    దైన్యమె యిసుమంత లేక ధైర్యము నిడగా
    అన్యులు గని మెచ్చగ సా
    మాన్యుడ నే వ్రాయుచుంటి, మాన్యుడ మీరే !

    ReplyDelete
  3. చక్కని పద్యం. అభినందనలు.

    ReplyDelete