Sunday, 26 June 2011

శంకరాభ(పూ)రణం - దత్తపది : పూరి - వడ - దోశ - అట్టు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 -06-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ  
  

                   దత్తపది :  పూరి, వడ, దోశ, అట్టు - మహాభారతార్థంలో......


                       శ్రీ కృష్ణుడు అర్జునునకు చేసిన హిత బోధ...

తే.గీ :  సమరమందున వలెనదో శక్తి యుక్తి !
          వడలి పోకుమ ! చేయుము వారి వధను!
          పూరి గరచునె కౌంతేయ ! పులియు సహజ
          ధర్మ మట్టులె విడనాడి? ధర్మ మిదియె! 

2 comments:

  1. పూరి,ధోస, అట్టు ను తిన్న పిదప మీ యొక్క శంకరాభరణపు మూడురెండ్లు పూరణలు పూర్తవుతున్న శుభ సందర్భములొ మీకు అభినందనలు...శ్రీనివాస్ హైదరాబాద్.

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారూ! మాపద్యములను రుచి జూసి మెచ్చుకొను చున్నందుకు మీ రసజ్ఞతకు ధన్యవాదములు.

    ReplyDelete