శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
సమస్య: మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
తే.గీ: తమిళ తమ్ముళ్ళ తపనను తలచుకొనుము,
మాతృ భాషాభిమానమ్ము మనకు ముద్దు
నల్ల ముఖమును వేయకు; తెల్ల వారి
మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
తే.గీ: తెలుగు భాషను బలుకగ తెగులటంచు
ఆంగ్ల భాషను నేర్వగ నాత్ర పడుచు
తేనె వదలుదు వదియేల? తెల్ల వారి
మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.
రాయల కాలం నాటి దేశభాషలందు తెలుగులెస్స అన్న మాటను మరల గుర్తుకు తెచ్చిన శాస్త్రి గారికి ధన్యవాదములు
ReplyDelete